అభిషేకం – కవిత

దేవుడికి క్షీరాభిషేకం

అన్నార్తులది కన్నీటి అభిషేకం

అన్నార్తుల ఆకలి తీరిస్తే

మానవత్వం పరిమళించు

పరిమళించిన మానవత్వంలో

దైవత్వం దర్శించు

మానవుడే మహనీయుడై

మహిలో ప్రకాశించు