అద్వితీయం – కవిత

Author
Brundavanam Satyasai

Last Updated on

పాలసంద్రము నందు పవళించు తండ్రి

పాలిచ్చు తల్లికే పుట్టె చూడండి

రాతియే మెరిసేను నువుగాని మడితే

రేపల్లె మురిసేను నువు మురళి ముడితే

శివుని శిరముననున్న గంగమ్మ తల్లి

మా నెత్తికెక్కేను సూరీడు మళ్ళీ

ఎంత దాక్కుంటావు ఆ యెనకకెళ్ళి

వానజల్లై రావె మాయమ్మతల్లి

చల్లాని రామయ్య నాన్నకూ ముద్దు

నల్లాని కిట్టయ్య వెన్నకూ ముద్దు

ఎల్లాగ నీ ఆట చేరేను హద్దు

కాలాన ఈ పాట బంగారు పద్దు

ఇంద్రుడే చూడగా కొండనే మోసి

నీ తల్లి పాడగా నీ గొప్ప చూసి

నీ మనసు మెచ్చాడు ఆ సవ్యసాచి

నీ కతలు చెబుతాడు ఈ సత్యసాయి

1 thought on “అద్వితీయం – కవిత”

  1. చాలా బాగా రాసారు బ్రుందావనం సత్యసాయి గారు…కవిత లొ భావం చాల గొప్పది , లోతయినది

Leave a Reply