Last Updated on
నిజము నిక్కమై నిలుచును
మరణానికి భయమేల
లే..లే లే.. ఓ అవనిజ
సమయం లేదు పరిగెత్తు
లేదంటే నడువు
అది కుదరకపోతే పాకు
కాని స్తంభించకు..!!
తప్పులు ఎన్నో చేస్తాము
కాని తప్పిదము నుండి
గుణపాఠం నేర్వాలి తప్ప
కృంగి కృశించరాదు..!!
ఒక్కసారి తప్పు
రెండో సారి కొవ్వు
మూడో సారి అసహ్యం
ఇదేనా జీవితం??
పద పద పరిగెత్తు
ఆ నడకలకి
గణ గణ మోగాలి
పంచభూతాలు..!!
ఆ శరాల చూపులకు
సూర్య.. చంద్రులే
దాగలి మబ్బులో..!!
దిక్కులు అన్ని
నీకే దిక్కుగా నిలువాలి..!!
ఏమంటావు ??
సమయం లేదంటావా
లేక సమయమంతా నాదంటావా
నా ఈ కవిత మీ హృదయంతరాలలో
అగ్ని ఖనికలై పొంగాలి
అవే మీ విజయాలకు
నాంది పలకాలి..!!