అక్షర అరవిందాలు – కవిత

Author
Shaik Moulali

Last Updated on

చక్కని మాటలు నీ వమ్మ, నీ చక్కని మాటలు చాలమ్మా

చల్లని చూపులు  నీ వమ్మ, నీ చల్లని చూపులు చాలమ్మ,

మంచిగ నవ్వులు నీ వమ్మ, నీ మంచిగ నవ్వూ

చాలమ్మా!

నీవు పంచే మమతలు చాలమ్మా, నీ ముఖము చూస్తే చాలమ్మా!

మాటలాడకుండా ఎవరుంటారమ్మా!?

కళ్ళా కపటము లేని, మనిషి వమ్మా, నీవు !

నీవెంతో, ఇన్నోసెంట్ వమ్మా!

అందుకే నిను మరచి పొలేనమ్మా!

నీ కంటికి రెప్పను నేనమ్మ, రెప్ప కాలం 

పాటు ఆలోచిoచవమ్మా !

అభిమానమూ, ఆత్మాభిమానమూ, రెండూ, రెండు కళ్ళమ్మా,

అభిమానమే నీవయితే, ఆత్మాభిమానమే

నేనయితే

రెండింటి మధ్యా నలిగి పోయాను!  చెల్లెమ్మా!

అది నువ్వే నమ్మా!  ఓ చెల్లమ్మా !

అది నువ్వే నమ్మా, నవ్వే   చెల్లెమ్మా!

అది నువ్వే నమ్మా!  నవ్వించే, ఓ చెల్లెమ్మా!

అమ్మ వంటూ, చెల్లెమ్మ వంటూ, పిలుచు 

కున్నాను !  గదమ్మా నిన్ను

నేను అoటే ఏంతో, నువ్వు  అన్నా అoతే

ప్రాణము , ఓ చెల్లెమ్మ!

నీవు మాటలాడక పోతూ ఉంటే , 

నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెల్లెమ్మ !

రోజు, రోజూ, కళ్ల వెంట కన్నీళ్ళు వస్తూ,

ఉంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా,

చెల్లెమ్మా!

అనుచిత సంభాషనను తుంచి  వేయగల 

మందు మౌనముతో మందలించడమే, 

అందుకనేనా అమ్మా!

మాటలాడవద్దని చెప్పి, చెప్పీ, మౌనమే  

వహించి నావా!  చెల్లెమ్మా!

అంత కష్టం, అoత నష్టం, అoత బాధ పడి

నావా!  చెల్లెమ్మా!

నిజంగా సారీ !  అమ్మా!   నీ మాటలు, నేను

అర్థము చేసుకోలేదు, చెల్లెమ్మ!

నీతో మాటలాడటము, నా హక్కు  అనుకున్నానమ్మా ! చెల్లెమ్మా! 

నీ దగ్గరకు  రావటము, నా బాధ్యత  అనుకున్నానమ్మా !  ఓ చెల్లెమ్మ!

ఈ చెల్లెమ్మ ను నా సొంత  చెల్లెమ్మ నే 

అనుకున్నాను!  ఓ చెల్లెమ్మ!

అమ్మే అనుకుంటూ, చెల్లెమ్మ వనుకుంటూ,

మురిసి పోయాను, చెల్లెమ్మ!

అమ్మా, నే నెప్పుడూ నిన్ను ఏమీ  అనలేదు 

గదా!  చెల్లెమ్మ!

నామీద కోపము  వద్దమ్మా  !  చెల్లెమ్మా!  అని

నీతో, మాట్లాడకుండా, నేనుండ లేనమ్మా! అని,

నాతో , మాట్లాడకుండా ఉండొద్దమ్మా !  అని,

బతిమిలాడు కున్నాను గదా!  చెల్లెమ్మ!

ఐనా, నీ మనసే కరుగ లేదా? ఓ చెల్లెమ్మ!

ఈ అన్నయ మీద కోపము taggaleda? చెల్లెమ్మ!

మీరు ఎప్పటికీ నాతో మాటలాడకoడి ,

అని అన్నావా!  చెల్లెమ్మ!

నేను మాటలాడుతూ వుంటే, మౌనమే 

వహిoచి నావా? చెల్లెమ్మ!

అoత pedda శిక్ష vesinava ? చెల్లెమ్మా!

సరే నమ్మా!  చెల్లెమ్మ, నీవే కరెక్ట్ ఏమో ?

చెల్లెమ్మా!

సరే నమ్మా!  నేను సిద్ధమే  !  ఓ చెల్లెమ్మ!

నిజమయిన ప్రేమకు, అభిమానానికి 

త్యాగమే  ప్రతీక  గదా!  చెల్లెమ్మ!

నాకు నేను శిక్ష వేసుకుంటున్నానులే !  ఓ చెల్లెమ్మ!

నీవు మాటలాడేవరకు , నేను కూడా 

మాట్లాడనులే !  చెల్లెమ్మ! 

ఇది అన్నయ్య  మాటా చెల్లెమ్మ! 

ఇది అన్నయ్య  బాటా!  ఓ చెల్లెమ్మా!

నీవు ఎక్కడ  కనబడినా, తలదించుకుని

వెళుతుంటాను, చెల్లెమ్మ!

తలవంచుకుని వెళుతుంటాను ! ఓ చెల్లెమ్మ

నీ కోసము మౌనపోరాటము  చేస్తున్నానులే, 

చెల్లెమ్మ!

మాటల కంటే  మౌనమే పదునైనదని  

నిరూపించావా, చెల్లెమ్మ! 

నేను కూడా నీ బాట నే అనుసరిస్తాను! చెల్లెమ్మ!

మౌనాన్నే,  ఆశ్రయిస్తానూ !  ఓ చెల్లెమ్మా!

నీ ద్వారా  నిజమయిన ప్రేమకు, అభిమానానికి, అర్థాన్ని, తెలుసుకోగలిగాను, చెల్లెమ్మ

జీవితమంటే, కొత్త  అర్థాన్ని కూడా, తెలుసుకున్నాను, ఓ చెల్లెమ్మ,   

జీవితమంటే గెలుపు, ఓటములే , కాదని!

జీవితమంటే స్వార్థం, లేనటువంటి  నిజమయిన ప్రేమ, అభిమానంతో, 

కూడినటువంటి ఒక భావన, అని

తెలుసుకున్నానులే !  ఓ చెల్లెమ్మ!

ధన్యుడనమ్మా చెల్లెమ్మ! ధన్యుడనయ్యానమ్మా!  చెల్లెమ్మా!

నీవు మాటలాడిన, మాట్లాడ(లే)క పోయినా

చెల్లెమ్మ!

ఈ అన్నయ్య  గుండెళ్ళో, కల  కాలం ఉండి

పోతావులే !  ఓ చెల్లెమ్మ!

నీవు ఎంతో దూరం , వెళ్లిపోయానని  , 

అనుకుంటున్నావా? చెల్లెమ్మ,

లేదమ్మా, లేదు లేదమ్మా, ఓ చెల్లెమ్మా!

నీవు ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పోలేవూ! 

ఓ చెల్లెమ్మ,

నా కళ్ళల్లోనే ఉన్నావు!  కళ్ళముందరే  

ఉంటున్నావు! చెల్లెమ్మ,

నాతో, మాటలాడక  పోయిన, చెల్లెమ్మ!

నీవు మంచిగ, ఉండాలమ్మ !  చెల్లెమ్మ!

నీవు చల్లగ ఉండాలమ్మా!  చెల్లెమ్మ,

నీవు సల్లంగా ఉండాలమ్మా!  ఓ చెల్లెమ్మా!

మెరిసే, మేఘ మాలికా!  ఓ చెల్లెమ్మా!

ఉరుములు చాలూ, చాలికా!

ఉరుములూ చాలు, చాలిక!

ఆకాశ దేశాన, ఉన్న ఓ చెల్లెమ్మ!

ఇంక భూమికి, దిగిరావమ్మా!

ఇక భువికి, దిగిరావమ్మా!

మరో జన్మ ఉన్నదో? లేదో?, అపుడీ మమతలు ఏమవుతాయో ? ఏమో?

మనిషి కి  మనసే తీరని శిక్ష, దేవుడిలా

తీర్చుకున్నాడమ్మా కక్షా!

నీవు కూడా  ఇలా  తీర్చు కుంటున్నావమ్మా

కక్షా!?

అమ్మా! నేనూ, ఆశావాదినే గదా!  చెల్లెమ్మ!

ఎప్పుడయినా, మా చెల్లెమ్మ, మాటలాడు

తుందనే, ఆశతో, బతుకు తున్నాను!  చెల్లెమ్మ!

అమ్మ వని, చిట్టి  చెల్లెమ్మ వనీ,

ప్రతి రోజు, ప్రతి గంటా, ప్రతి నిముషమూ  ,

నీ కోసము ఎదురు  చూస్తూ  ఉంటానులే  !

చెల్లెమ్మ!

పున్నమి  వెన్నెలలా, నా జీవితాన  వెలుగులు  నింపినవా!  చెల్లెమ్మ!

చల్లని చంద్రునిలా మమతే పంచినవా!

ఓ చెల్లెమ్మ!

ఎర్రటి సూర్యునిలా  భస్మం చేయబోయినవా!  చెల్లెమ్మ!

వాన దేవత వరుణుడిలా, కాపాడినవా !  ఓ

చెల్లెమ్మ!

జీవచ్చవాన్నై  మిగిలానా!  చెల్లెమ్మ !

ఐనను, నీ జ్ఞాపకాలతోనే, బతుకుతాను  !

ఓ చెల్లెమ్మ!

అన్న ఎప్పుడూ, ఒక్క  మాటా పడ లేదు,

పడ లేడు, చెల్లెమ్మా!

అలాంటిది  నీ కోసము ఎన్ని సార్లు  మాటలు

పడ్డానో ?

ఎన్ని సార్లు అవమానాలు, పడ్డానో, నీకు,

నాకు, మాత్రమే తెలుసమ్మా !ఓ చెల్లెమ్మా!

One  fact I will tell you sister!

You are so good and so innocent

No body is there in my WORLD like you

That is what, I am not going to forget you.

విష్ణూ  !  అక్షరార్చన ఇక్కడితో  ఆగదు!

రుతువుతో, పూవులు  పూయటము 

ఆగి పోవచ్చు, ఆమనితోనే ఆగి పోవచ్చు  

కానీ నా మనసు పూచే  అక్షర అరవిందాలు,

సర్వదా పూస్తూనే ఉంటాయి,

అర్చన సాగి  పోతూనే  ఉంటుంది.

చక్కనయిన ఓ చిరు  గాలి  !

ఒక్క మాట విని  పోవా  ?

నా చెల్లెమ్మ కు చెప్పిరావా!?

నీకోసము నీ అన్నయ్య ఎదురు 

చూస్తూ ఉన్నాడని  చెప్పి రావా  ?

మీరు మాట్లాడకండి, నే నే మీతో  

మాటలాడతానని, చెప్పిన మాటను  

గుర్తు చేసి రావా!?

చక్కనయిన ఓ చిరుగాలి!

ఒక్క మాటా విని పోవా?

నా చెల్లెమ్మకు చెప్పి రావా?

1 thought on “అక్షర అరవిందాలు – కవిత”

  1. It is very good . brother’s saying and requesting wisely. but sister’s response also must be there so that this conclusion will be total . any how it is the presentation about inner feelings and qualities of sister is highlighted nicely . k. jayanth kumar. 11.08.2018 I wrote prabodhaatmaka geetaalu meeru kuda chusi response ivvandi.

Leave a Reply