అరటి పండుతో తగ్గించుకోగలిగే 14 ఆరోగ్య సమస్యలు

Banana Health Benefits in Telugu:

అన్ని కాలలలో దొరికే విలువైన ఆరోగ్యపరమైన మంచి పండు  అరటి పండు దీనిలో పొటాషియం,విటమిన్లు అధికముగా ఉంటాయి . అరటి పండు మనకు ఎదురయే కొన్ని ఆరోగ్యసమస్యలకు పరిష్కారము చూపుతుంది. ఆ విషయాలు  తెలుసుకుంటే మీరు అరటి పండును “సూపర్ ఫ్రూట్”  అని నిస్సందేహముగా అంటారు.

1. అరటిపండు శరీరానికి శక్తిని ఇస్తుంది:-

అరటిపండు లో మూడు రకాల చక్కెరలు ఉంటాయి అవి గ్లూకోజ్ ,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్, వీటితోపాటు అధిక మొత్తములో పీచు ఉంటుంది. కాబట్టి శరీరానికి శక్తిని ఇచ్చేదిగా అరటి పండు గుర్తించబడింది. శాస్త్రవేత్తల అధ్యయనము ప్రకారము రెండు అరటిపళ్ళు 90 నిముషాల పాటు శారీరక శ్రమ చేయటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. అందుకనే ప్రపంచవ్యాప్తముగా క్రీడాకారులు అరటిపండ్లను తినటం అలవాటు చేసుకుంటారు.

2. డిప్రషన్ (కృంగుబాటు) ను అధిగమించటానికి:-

ఈ మధ్య జరిపిన పరిశోధనలలో క్లినికల్ డిప్రషన్ రోగులు అరటి పండ్లు తినటం వలన వారిలో అభివృద్ధి కనిపించింది అని తెలియజేస్తున్నాయి. అరటి పండు లోని ట్రిప్టోఫాన్ అనే పదార్ధము ఆవశ్యక అమైనో ఆమ్లము తయారు అవటానికి తోడ్పడి దానిద్వారా మెలటోనిన్ అనే హార్మోన్ ను,సెరోటోనిన్ అనేన్యూరో ట్రాన్స్ మీటర్ లను ఉత్పత్తిచేసి శరీరాన్ని రిలాక్స్ అయేటట్లు చేస్తుంది ఫలితముగా డిప్రషన్ తగ్గుతుంది. ట్రిప్టోఫాన్ ఆందోళనను కృంగుబాటును తగ్గించి,మైగ్రైన్(పార్శ్వ తలనొప్పి) రాకుండా చూస్తుంది  అరటి పండులోని లైసిన్ అనే అమైనో ఆమ్లము కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించటానికి ఉపయోగపడుతుంది ఫలితముగా కార్డియోవాస్కులార్ సమస్యలు తగ్గుతాయి.

3. స్త్రీలలో బహిష్టు ఇబ్బందులనుండి ఉపశమనాన్ని ఇస్తుంది:-

అరటిపండులా ట్రిప్టోఫాన్ తో పాటు బి6 విటమిన్ కూడా అధికముగా ఉంటుంది ఇది రక్తములోని  గ్లూకోజ్ స్థాయిల సమతుల్యతను కాపాడుతుంది. ఈరెండు పదార్ధాలు స్త్రీలలో బహిష్టు సమయములో ఏర్పడే నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

4. మెదడుకు శక్తినిస్తుంది:-

అరటిపండులోని పొటాషియం, చక్కెరలు మెదడు మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ఫలితముగా మెదడు ఏదైనా సమస్యలపై కేంద్రీకరించే శక్తిని పెంచుతుంది విద్యార్థులపైన జరిపిన ప్రయోగాల వల్ల అరటిపండ్లు ప్రతిరోజూఉదయాన్నే తిన్న విద్యార్థులు ఇతరులకన్నా  వారి చదువుల్లో  ముందుటున్నారని తెలిసింది.

5. రక్తవిహీనత (ఎనీమియా)తో బాధపడే వారికి అరటి పండు మేలు చేస్తుంది:-

అరటిపండులోని ఐరన్  ఆక్సిజన్ వాహకమైన  హీమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి ఎనీమియాతో భాధపడేవారికి హీమోగ్లోబిన్ తక్కువగాఉంటుంది కాబట్టి అరటి పండ్లు తింటే హీమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి ఎనిమీయా నుండి ఉపశమనాన్ని పొందగలరు.

6. రక్త పీడనములో సమతుల్యత ఉంటుంది:-

అధిక రక్త పీడనమును తగ్గించటానికి అరటిపండులోని ఎక్కువగా ఉండే పొటాషియం ,లవణము ఏమాత్రము లేకపోవటము బాగా ఉపయోగ పడుతుంది. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రక్షన్ వారు స్ట్రోక్స్ ను  అధిక రక్త పీడనాన్ని నివారించటానికి అరటిపండ్లు బాగా ఉపయోగిస్తాయి అని తెలిపారు.

7. గుండెల్లో మంటను తగ్గిస్తుంది :-

ఎక్కువగా క్రొవ్వు పదార్ధాలను తినటమువల్ల ,కార్బోనేటేడ్ డ్రింక్స్ త్రాగటం వల్ల గుండెల్లో మంట  ఏర్పడుతుంది. అరటి పండ్లు తినటం వల్ల జీర్ణాశయములో ఏర్పడే ఎసిడిటీని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా తొలగిస్తుంది కూడా.

8. మలబద్దకాన్ని నయముచేస్తుంది:-

అరటిపండులోని పోషక పీచు పదార్ధము అసౌకర్యము కలిగించే చికాకైనా సమస్య మలబద్దకం నుండి విముక్తి కలిగిస్తుంది. ఉదయాన్నే అరటిపండు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే సాధారణ బవుల్  కదలిక లను కలుగజేస్తుంది కాబట్టి మలబద్దకాన్ని రసాయన విరేచన కారిణులను తీసుకొనే అవసరము ఉండదు.

9. మానసిక ఆందోళనను ఒత్తిడులను  తగ్గిస్తుంది:-

మన శరీరానికి గుండె కొట్టుకోవటాన్ని నియంత్రించటానికి పొటాషియం అవసరము ఫలితముగా మెదడు కణాలకు ఆక్సిజన్ అంది శరీరములోని ద్రవాలు సమతుల్యము గా ఉంటాయి ఈ చర్య మానసిక ఆందోళనను తట్టుకోవటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది .మన శరీరములో రక్త ప్రసరణ లో  పొటాషియం లేకపోతె మనము అప్పుడు ఒత్తిడికి గురి అవుతాము.గుండె వేగముగా కొట్టుకోవటం మొదలవుతుంది. మెదడు వేగముగా నిర్ణయాలను తీసుకోలేదు చేతులు కొద్దిగా వణకటం మొదలవుతుంది. అరటి పండు తినటం ప్రారంభిస్తే ఇవేవి కనిపించవు.

10. పొగత్రాగటం మానటానికి మంచి సాధనము:-

మీరు ధూమపాన ప్రియులయితే, ధూమపానం మానాలనుకున్నప్పుడు అరటి పండు బాగా ఉపయోగిస్తుంది అరటి పండు లోని బి విటమిన్లు,మెగ్నీషియం,పొటాషియం వంటి పోషకాలు నికోటిన్ విత్ డ్రాయల్ లక్షణాలను ఎదుర్కోవటములో బాగా పనికి వస్తాయి. కాబట్టి సిగరెట్ త్రాగాలి అన్న కోరిక నశిస్తుంది సులభముగా పొగత్రాగటం మానవచ్చు.

11. పులిపిర్లను నయము చేయటానికి:-

అరటి పండు తొక్కతో పులిపిర్లకు వైద్యము చేయవచ్చు అరటి పండు తొక్కను పులిపిర్లు ఉన్న ప్రాంతము పై ఉంచి బ్యాన్డ్  ఎయిడ్ లేదా టేప్ ను తొక్క కదలకుండా అతికించి ఒక రోజు ఉంచితే పులిపిరి మాయము అవుతుంది 12. స్నాక్స్ గా మంచి ఆహారము:-  బరువు ఎక్కువ  ఉన్నవారు తీపి పదార్ధాలను స్నాక్స్ గా తినాలని కోరిక ఉన్న బలవంతముగా చంపుకుంటారు. అటువంటి వారికి అరటి పండ్లు తీపి పదార్ధాలు, చాకోలెట్లు వంటి వాటికి బదులుగా పనికివస్తాయి. ఇవి మధ్యాహాన్న భోజనము తరువాత  రాత్రి భోజనము మధ్య కాలములో శక్తి నివ్వటానికి పనికీ వస్తాయి. కాబట్టి లావు ఉన్నవారు స్నాక్స్ గా అరటి పండ్లను వాడవచ్చు.

12. స్నాక్స్ గా మంచి ఆహారము:-

బరువు ఎక్కువ  ఉన్నవారు తీపి పదార్ధాలను స్నాక్స్ గా తినాలని కోరిక ఉన్న బలవంతముగా చంపుకుంటారు. అటువంటి వారికి అరటి పండ్లు తీపి పదార్ధాలు, చాకోలెట్లు వంటి వాటికి బదులుగా పనికివస్తాయి. ఇవి మధ్యాహాన్న భోజనము తరువాత  రాత్రి భోజనము మధ్య కాలములో శక్తి నివ్వటానికి పనికీ వస్తాయి. కాబట్టి లావు ఉన్నవారు స్నాక్స్ గా అరటి పండ్లను వాడవచ్చు. 

13. దోమలు కుట్టినప్పుడు ఆయింట్ మెంట్ గా వాడవచ్చు:-

దోమలు కుట్టినప్పుడు సింథటిక్ లోషన్లు వాడటానికి ముందు అరటిపండు గుజ్జును దోమకుట్టినచోట పూయాలి. ఈ విధముగా చేస్తే దోమకుట్టటం వలన కలిగే దురద తగ్గి ఆ ప్రదేశములో వాపు తగ్గుతుంది.

14. మార్ణింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది:-

శరీరములోని హార్మోనుల స్థాయిలలో వచ్చే మార్పులు, షుగర్ లెవెల్స్ లో మార్పుల వల్ల ఈ మార్ణింగ్ సిక్ నెస్ ఏర్పడుతుంది. అరటి పండు తినటము వల్ల ఈ రెండు సమస్యలు తగ్గుతాయి. ఈ  మార్ణింగ్ సిక్ నెస్ గర్భిణీ స్త్రీలలో పరగడుపునే వాంతి అయేటట్లు ఉండటం వంటి లక్షణాలతో ఉంటుంది అరటి పండులోని పోషకాలు గర్భిణీ స్త్రీలకు బాగా ఉపకరిస్తాయి. ఇవండీ అరటి పండుతో మనము తగ్గించుగో గల కొన్ని ఆరోగ్య సమస్యలు అరటిపండు ద్వారా మనకు అందే  పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి మనకు మందుల అవసరము తగ్గుతుంది ఆరోగ్యము బాగు పడుతుంది. ఈ మధ్య కొన్ని రసాయనాలు ఉపయోగించి పచ్చి అరటికాయలు కృత్రిమముగా పండిస్తున్నారు అటువంటి పండ్లు ఆరోగ్యానికి మంచి చేయకపోగా హాని చేస్తాయి కాబట్టి జాగ్రత్త గా ఉండాలి. 

వ్యాస రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

1 thought on “అరటి పండుతో తగ్గించుకోగలిగే 14 ఆరోగ్య సమస్యలు”

Comments are closed.