ఆర్మీ సైనికులు – కవిత

భరత మాత ముద్దుబిడ్డలు ….

భారత జాతి అండదండలు… 

మంచి తనానికి పెద్ద దిక్కులు….

వీర రణానికి  యుద్ధ వీరులు…

దేశ క్షేమం కోరే ప్రాణధాతలు..

వాళ్ళ మతం సమానత్వం.!

వాళ్ళ కులం భరతమాత కుశలం. !

ప్రాణ త్యాగం ధైర్య సాహసం..!

భరత జనుల ప్రశాంతతకు కారణం . .!

ప్రథమ పూజ్యులు…..,

పరమ వీరులు….,

మన బ్రతుకులకు కాపలా దారులు…..,

దేశ ప్రజల క్షేమ స్మరణ …;

అవ్వాలి అమరులకు నివాళి సమర్పణ…;

జై జవాన్… జై భారత సైనికాదళం… జై హింద్.