Author
పిల్లల్లారా పిడుగుల్లార రారండి
పసిడి పలుకులే వినరండి
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు
జగతిన వెలుగులు నింపేస్తాడు
బాలల్లారా బుడతల్లారా రారండి
బంగారు మాటలు వినరండి
మేఘాలు చినుకులు రాల్చేనండి
పుడమిన విత్తులు మొలకెత్తునండి
కూనల్లారా కిరణాల్లారా రారండి
కనకపు వాకములు వినరండి
మొక్కలెన్నో నాటండి
పచ్చని పకృతిని కాపాడండి
చిరుతల్లారా చిన్నారుల్లార రారండి
స్వర్ణపు సుభాషితాలు వినరండి
నదులను కాలుష్యం నుండి కాపాడండి
రత్నాల భారతిని ముందుంచండి
baalala geyam chalaa baagundi.