చిన్నది – కవిత

గతాన్ని గుర్తు చేసి చిత్రవధ చేస్తుంది
ఆ పిల్ల….

క్షణం తీరికలేకుండా గుర్తుకొచ్చి,
ఊపిరాడకుండా చేస్తుందీ ఆ పిల్లే…..

నేనంటే ఇష్టమని అందమైన అబద్దాన్ని
తనకంటే అందంగా చెప్పింది కూడా ఆ పిల్లే….  

నా కన్నీటి జడివానకు
ఉరుము తానే….. మెరుపు తానే…..

ఊపిరి సలుపనీదు….
ఊహాకసలే అందదు…..

ఇన్ని చేసిన ఆ చిన్నది
నా మనసునిండా దాగి ఉన్నది.