Author



ఆయన నడిచే విజ్ఞానం
ఆయన బాట నిమ్న
వర్గాల పసిడి పూదోట..!!
దళితుల పాలిట దేవుడు
దారిద్ర్య రేఖకు దిగువనున్న
బీదలకు ఆపన్నహస్తం..!!
భారత రాజ్యంగం రచించి
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక,
ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా
విశ్వానికి చాటేల చేసిన ధీరుడు..!!
అంటరానితనాన్ని అధఃపాతాళానికి
తొక్కేసిన అపర కృషీవలుడు..!!
సమన్యాయంకై.. సమసమాజంకై
పాటుపడి విజయం సాధించిన
మహోన్నత మూర్తి..!!