ఏమిటో ఇది – కురచ కథ

Author
BVD. Prasadarao

Last Updated on

ఉక్కిరిబిక్కిరి పర్చే గాలి.

చూపును చిక్క పర్చే చీకటి.

పడుతూన్న ఆ చినుకులు వర్షం అయ్యే అవకాశం ముమ్మరంగా ఉంది.

వెలుగును అగు పర్చే వేకువ, ఆ రాత్రికి మధ్యన నిశ్చింతగా నిద్రిస్తోంది.

ఐనా ఇంత ఇది లోనూ అతడు ఆగక తను చేపట్టిన పనికి సాహసిస్తున్నాడు.

అతడు మొండివాడు కాదు. నిజంగా అతడు పరమ పిరికితనం పూర్ణంగా ఉన్నవాడు.

అవసరం అతనిని ఉసిగొలిపింది, ఈ త్రోవన పెట్టింది.

ఆ త్రోవన తన ఎదురీత కొనసాగిస్తున్నాడు.

ప్రకృతి వంతు పాడడం లేదు, పంతంలా వ్యవహరిస్తోంది.

ఐనా అతడు కదులాడుతున్నాడు. తను చేపట్టిన పనికి చేరువ కావాలని తపిస్తున్నాడు.

ఎట్టకేలకు తన ఇంటికి చాలా దూరంలో ఉన్న ఆ చోటుకు వచ్చేశాడు, కానీ ఎప్పటిలా కాక ఈ మారు చాలా సమయం హెచ్చించాడు.

అతడు అక్కడకు చేరీచేరగానే అక్కడ చెట్టుకు కట్టబడి ఉన్న తన ఆవును గబగబా పక్కనే ఉన్న శాలలోకి తోలుకుపోయే పనిని చేపట్టేశాడు.

అప్పడే ఆ చినుకులు కూడా ఒక్కమారుగా ముమ్మరమైన వర్షంను చేపట్టాయి.

* * *

15 thoughts on “ఏమిటో ఇది – కురచ కథ”

  1. కథ బాగా నచ్చింది. మంచి కథలు ప్రచురిస్తున్న మీకు థాంక్స్.

  2. కథ చాలా బాగుందండీ. మనిషి ఆస్తి మానవత్వం. దానిని నిలుపుకోవడం గొప్ప విషయం.

  3. కథ చిన్నదే కానీ మంచి పసందైనది. మీకు అభినందనలు

Leave a Reply