గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – కవిత

Author
Pavan Kumar G

Last Updated on

గణతంత్ర దినోత్సవం.. మన 

పూర్తి స్వాతంత్ర్య మహోత్సవం…

మొదలు.

ప్రజలంటే ప్రభుత్వం…

ప్రభుత్వమే ప్రజలు..

అసలు.. 

ప్రభుత్వమంటే వ్యాపారం..

ప్రజలు ఓటు కే పరిమితం..

స్వతంత్ర మే సర్వసత్తాకమనీ..

సమ సమాజమే సామ్యవాదమనీ..

మతవివక్ష లేని లౌకిక రాజ్యమనీ…

ప్రజల ప్రభుత్వమే ప్రజాస్వామ్యమనీ..

గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర భారతమై….,

నేడు మిగిలింది చెరిగిన జ్ఞాపకమై..

మనం మరిచిపోయిన ఆశయమై..

ఓ ఆవేశపు అనాధ శాశనమై ..

బ్రిటిషోడు విడిచె బానిసత్వ సంకెళ్లు…

కారణమై నిలిచె మహాత్ములు ఊపిరి లు..

నేటి తరానికి ఆయువు పట్టులు..

ముందు తరాలకు స్ఫూర్తి నిచ్చెనలు..

ఎందరో ఎందరెందరో తెచ్చిన స్వాతంత్ర్య భారతం ఇది… స్వేచ్ఛా సమాజం ఇది..

అందరికీ వేలవేల వందనాలు.. 

శతకోటి ప్రణామాలు..

అమరులందరికీ..ఘన నివాళులు… నమస్సుమాంజలిలు..

..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

మంచి మానవత్వం నశించకూడదని నా ఆకాంక్షలు…

Leave a Reply