గాంధీజీ మన బాపూజీ – కవిత

వెలుగు అంతరించి

చీకటి అలుముకొని

అరువది తొమ్మిదేళ్ళయిందని

ఎంతో బాధగా చెప్పవచ్చు

1948 ఢిల్లీలో గాడ్సే తుపాకీకి

చిక్కుకున్నది ఆ హృదయం

హేరాం అంటూ చివరిశ్వాస విడిచారు

ప్రతిదినం ఆ నోట్లపై

మా హృదయాల్లో

ఆయనని తలుస్తూ

ఆనందాన్ని పొందుతాము

అతనే సమరయోదుడు, జాతిపిత

గాంధిజీ మన బాపూజీ


శాంతితో చేత కర్రపట్టి

మురికివాడల్ని, ఆంగ్లేయులమట్టి హృదయాలని

పరిశుభ్రత చేసిన

ఆ వ్యక్తిని ఎలా మరుస్తాము?

ఎక్కడో గుజరాత్ లో జన్మించినా

ఇంగ్లాండులో బారిష్టరు చదివినా

ఓ వేగమైన నదిలా ప్రతిదినం

మన జీవితంలో ప్రవహిస్తుంటారు

సత్యం, అహింసలే ఆయుధాలుగా

వారు సమకూర్చుకొని 

మనల్ని గెలుచుకున్నారు

అతనే సమరయోధుడు, జాతిపిత

గాంధీజీ మన బాపూజీ..

1 thought on “గాంధీజీ మన బాపూజీ – కవిత”

  1. ప్రతి మనిషి సముద్రననీ చూడటానికి పడవ లేదా షిప్ లో వెళ్తారు……….అలాగే చూసి ఆనందిస్తారు..
    కని కొందరు మాత్రం పడవ్వలలో నో షిప్ లోనో వెళ్లి చూసి ఆనందించే రకం కాదు. సుబమెరిన్ లో వెళ్లి సముద్రపు అంచులకి వెళ్లి చూస్తారు.. ప్రతిదీ బాగా డెప్త్ కు వెళ్లి చూస్తారు..వాటిగురించి తెలుసుకుంటారు…
    ఈఈఈ స్సముద్రం మనిషి అనుకుంటే ప్రతి మనిషి తన ఎదుట మనిషిని పడవ and షిప్ అంటే ముఖం and stayil చూసి ఏఎవరిని డిసైడ్ చెయ్యకూడదు బాడ్ ఆఆ గుడ్ ఆఆ అని
    స్యబమెరిన్ తో సముద్రం లోపల చూసినట్టు మన మనసుతో ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకోవాలి మిత్రమా…. అలా అర్థం చేసుకుంటే శత్రువులు వుండరు కులాలు మతాలు ఉండవు …… గొడవలు ఉండవు … అలా ఉంటున్న వారికి thanks ….. ఇది చదివినందుకు Thanks…..
    your పవన్ (pa1) మనిషి ని సముద్రం తొ పోల్చి ప్పోల్చిన విధానం నచ్చితే reply ఇవ్వండి మిత్రులారా……

Comments are closed.