గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
రాసినవారు: గంగా
పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9 పార్ట్ – 10
పార్ట్ – 11

నా పేరు గంగా. నేను అనాధను.
నాకు మూడు, నాలుగు సంవత్సరాలు అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుండి నా జీవితంలో జరిగిన సంఘటనలను మీ అందరితో పంచుకుంటున్నాను.
నాకు అమ్మ లేదు.. నాన్న లేడు..
నాకు మూడు, నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరో నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు.
నాకు ఆకలి అయి ఏడుస్తున్నా ..
ఒక ఆమె “ఏమైందే ఏడుస్తున్నావు” అని కట్టెల పొయ్యిలో వున్న ఇనుప గొట్టం తీసుకొని వచ్చింది.
నేను ఏందో అని చూస్తున్న.
అది అగ్గిలాగ, ఎర్రగా వున్నది.
నా దగ్గరకు వచ్చి, నా కాలు పిక్కకు క్రాస్ లో పెట్టింది.
నాకు భయంకరమైన మంట, నొప్పి కలిగింది. నేను గట్టిగా కేకలు వేసిన.
“ఇంకా ఏడిస్తే మళ్ళీ ఇలాగే వాత పెడతా .. నోరు ముయ్ ” అంటు నా చెంప మీద గట్టిగా కొట్టింది.
పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9 పార్ట్ – 10
పార్ట్ – 11