Gangaa – Part 10

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

రాసినవారు: గంగా

ఆ రోజు ఆదివారం.

ఒక ఆడామే గంపలో జామ పండ్లు పెట్టుకొని అమ్ముతుంది.

‘గంగా.. జామ పండ్లని పిలు..’ అన్నది ఆమె. నేను పిలిచిన.

జామ పండ్ల ఆమె ఇంటికి వచ్చింది.

ఆమె జామపండ్లు కొన్నది.

పెద్ద, పెద్ద పండ్లు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఇంట్లో మనుషులకు ఇచ్చింది.

నాకు చిన్నది కాయ ఇచ్చింది. అది గట్టిగా ఉంది. నేను ఎంత కొరికిన దాని నుండి కొంచం ముక్క కూడా రావడం లేదు అంత గట్టిగా ఉంది.

జామ పండ్ల ఆమె నన్ను చూసి, గంపల నుండి తెల్లటి పండు తీసి ‘ బుజ్జి అది పడేయ్.. ఈ పండు తిను..’ అని ఇచ్చింది.

ఆ కాయ పడేసి ఆమె ఇచ్చిన పండు తీసుకున్న.

ఇంతలో ఆమె పైసలు ఇవ్వడానికి వచ్చింది. నా చేతిలో పండు చూసింది.

‘గంత మంచి పండు యాడిది? నాకు ఇయ్యు. నీకు ఇంకోటి ఇస్తా’ అన్నది.

పండ్ల ఆమె అన్నది, ‘నేను పడేసిన కాయ ఆ పిల్లకు ఇచ్చినవ్. ఆ పిల్ల కొరికితే పన్ను గాటు కూడా పడుతలేదు. నేను అది పడెపిచ్చి, నా గంపల పండు ఇచ్చిన. ఎందుకు ఇవ్వమంటున్నవ్? తిను బుజ్జి తిను’ అన్నది.

నేను భయపడుతున్న.

‘భయంపట్టకు. నేను, నువ్వు తిన్నదాకా ఉంటా.. తిను’ అన్నది.

అప్పుడు తిన్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45