Gangaa – Part 12

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

నేను స్కూల్ నుంచి నాలుగు గంటలకు వచ్చిన.

బుక్స్ తీసి హోమ్ వర్క్ చేస్కుంటున్న.

ఆమె, ‘ ఇట్ల రా..’ అన్నది. ‘ఇప్పటి దాకా స్కూల్కి వెళ్ళినవ్. ఇంటికి వచ్చినంక మళ్ళీ పుస్తకాలు ముంగట పెట్టుకున్నవ్?’ అని, ‘అన్న బట్టలు పిండెయ్’ అన్నది.

నేను వెళ్ళి బట్టలు పిండుతున్నాను.

ఆమె కొడుకు వచ్చి,’పిండుతున్నవా.. తెల్లగా పిండు..’ అని, ‘ ఇగో ఈ డబ్బా టినోపాల్. ఇది బట్టలు పిండిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్ళు పోసి, ఈ టినోపాల్ వేసి, బట్టల్ని దాంట్లో అయిదు నిమిషాలు నానవెట్టు. ఇంకా తెల్లగా అయితయ్.’ అన్నడు.

‘సరే’ నని అన్న.

అతను వెళ్ళిపోయాడు.

ఆ తెల్లబట్టల మురికి పోయేదాక నలిస్తే నా చేతులు చాలా నొప్పి అయి, ఎర్రగా అయినయ్.

ఆ బట్టలను టినోపాల్ వేసిన నీళ్ళలో, అయిదు నిమిషాలు నానబెట్టి తీసి, కిందికి ఉన్న దండెమ్ మీద ఎండేసిన.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45