Gangaa – Part 2

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

రాసినవారు: గంగా

పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9
పార్ట్ – 10
పార్ట్ – 11

పల్లెములో వేడి అన్నం తెచ్చింది. నా ముందు పెట్టి తిను అన్నది.

నేను అప్పుడు చిన్నదాన్ని, నాకు తెలది కదా వేడి అన్నంలో చేయి పెడితే కాలుతుందని. నేను అలాగే అన్నం లో చేయి పెట్టాను. చేయి పెట్టగానే నా చేతి వేళ్ళు ఎర్రగా కాలి మంట లేసినయి.

ఆమెతో అన్నం కాలుతుంది అన్నాను.

కోపంతో అన్నం ప్లేట్ తీసుకుపోయి, చల్లటి అన్నం తెచ్చి నా ముందు పెట్టింది.

ఆ అన్నం చల్లగా, మెత్తగా నీరు, నీరుగా వున్నది(పాచి పోయిన అన్నం అని పెద్దగా అయ్యాక తెలిసింది).

నేను అదే తిన్నాను.

అంతే ప్రతిరోజు పాచి అన్నమే పెట్టేది.

నాకు తినబుద్ది కాకపోయెది. కానీ ఆకలి తట్టుకోలేక ఆ పాచి అన్నమే తినేదాన్ని.

Leave a Reply