Gangaa – Part 23

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

నేను బొమ్మను చూస్తూ కాపీలో దించుతున్నాను.

ఆమె కొడుకు(అతని వయసు 25 సంవత్సరాలు, ఏమి పని చేయడు. ఊర్లపడి తిరుగుతడు),’గంగా ఏం దించుతున్నవ్’ అన్నడు.

‘సైన్స్ సార్ పాఠంల బొమ్మలను దించుకు రమ్మని అందరికీ చెప్పిండు’ అని చెప్పిన.

‘ఇటియ్ నేను దించుత’ అన్నడు.

నేను ‘వద్దు’ అని, ‘ సార్ ఎవరితో దించిపిచ్చుకోవద్దు అన్నడు. ఎవరన్న అట్లా దించిపిస్తే బాగా కొడతా, గోడకుర్చీ యేపిస్తా అన్నడు.’ అని చెప్పిన.

‘నన్ను సార్ కొడతడు, వద్దు’ అన్న.

కోపంతో ‘ఏం కొడతడు, ఇటియ్ నేను దించుత’ అని నా కాపీని గుంజుకొని బొమ్మలన్నీ దించిండు.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45