గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
నేను బాసండ్లు తోమేటప్పుడు, ఆమె కూడా నా దగ్గర నిలబడి ఉన్నది.
ఒకతను ఆమె దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు.
అతను నా వైపు చూసి ‘ఇంత చిన్న పిల్లతో బాసండ్లు తోమిపిస్తున్నావు.. స్కూల్ కి పంపించు.. ‘ అన్నాడు.
‘స్కూల్లో వేస్తే పైసలు కావాలి. ఆడపిల్లకు చదువు ఎందుకు? ఆడపిల్ల పనులే చేయాలి’ అన్నది.
‘ఆడ, మగ అందరు సమానమే. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండవు’ అన్నాడు.

‘అయిన నేను పంపించను’ అన్నది.
అతను నన్ను అడిగాడు ‘చదువుకుంటావా గంగా?’ అని. నేను భయంతో ఆమె వైపు చూస్తున్నాను.
‘గంగా.. నువ్వు భయపడకు నేను రేపు వచ్చి, గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తా’ అని అతను వెళ్ళిపోయాడు.
రాసినవారు: గంగా
పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9 పార్ట్ – 10
పార్ట్ – 11