గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

స్కూల్లో నేను సంతోషంగా ఉన్నాను.
పిల్లలందరూ, నాతో సంతోషంగా మాట్లాడారు.
సాయంత్రం నాలుగు గంటలకు బెల్ కొట్టారు.
బెల్ కాగానే అందరు ఇళ్ళల్లోకి పోతున్నారు.
నేను కూడా ఇంటికి వెళ్తున్నాను.
కానీ నాకు దుఖం వస్తున్నది.
ఎందుకంటే ఆమె నన్ను ఏమంటదో, పని చెప్పి ఎంత కొడతదో అనుకున్న.
కానీ వెళ్ళక తప్పదు.
నేను బాగా చదువుకుంటాను.. రోజు స్కూల్కి వెళతాను.. అనుకొని ఇంటికి వెళ్ళాను.
ఆమె, ‘ఏమే.. వచ్చావా..’ అని, ‘సందకసులు(ఇల్లు ఊడ్వడం) తీసి, పెద్ద దీపం ముట్టియ్యు’ అన్నది.
నేను సందకసులు తీసి, పెద్ద దీపం ముట్టించిన.
రాసినవారు: గంగా
పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9 పార్ట్ – 10
పార్ట్ – 11