Gangaa – Part 8

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

ప్రొద్దున, లేవగానే..

ఆమె, ‘గంగా.. గమాలా తీసుకుని, బర్లని కొట్టుకపో. బర్లను మందల కలిపి పెండ పట్టుకొని రా..’ అన్నది.

నేను నెత్తి మీద గమాలా ఎత్తుకుని, బర్రెలను కొట్టుకొని పోతున్న.

బర్లు పెండ పెడ్తున్నయ్. ఆ పెండని గమాలలో వేసుకుంటూ, గమాలని నెత్తిన ఎత్తుకుంటున్న.

బర్రెలను మందలో కలిపి, పెండ తీసుకొని ఇంటికి వచ్చిన.

ఆమె వచ్చి, ‘ఆ బండల మీద పిడకలు సరు’ అని చెప్పింది.

ఆ పెండని బండల మీద పిడకలు సరిసిన.

నాకు స్కూల్కి టైమ్ అవుతుంది.

ఇంట్లోకి వచ్చి, చన్నీళ్ల స్నానం చేసిన.

అన్నం తింటానని, ప్లేటు తీసుకోబోయిన.

ఆమె నన్ను చూసి, ‘అన్నం కాలేదు, అట్లనే పో. పగలు వచ్చి తిను’ అన్నది.

సరేనని..

పలక తీసుకొని, స్కూల్కి వెళ్ళిన.

రాసినవారు: గంగా

పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9
పార్ట్ – 10
పార్ట్ – 11

Leave a Reply