జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు – కవిత

విలాసాల మత్తు వదలరా…యువకుడా..!

వివేకుని నిన్ను బాట నడవరా..నవ భారత 

వీరుడా..!……””విలాసాల””

జ్ఞానముంది… విజ్ఞానముంది..

కులమతా  వివాదాల విలువ పెంచకు..!

స్వేచ్ఛ ఉంది …నిరీక్షణుంది..

జాతి వర్ణ విభేదాల. వివక్షనెంచకు ..!…””విలాసాల””

వీర శివాజీ..శౌర్యాన్ని …గుర్తుచేసుకో….!

మన నేతాజీ… ధైర్యాన్ని… వెంటపెట్టుకో..!

పుడమి తల్లి సేవకుడై..పేరుతెచ్చుకో..!

మాతృభూమి శ్రామికుడై.. ఋణం తీర్చుకో…..!””విలాసాల””

సాంకేతిక సమాజం.. మారెను గా. తెలివైన వివాదమ్..!

నిస్సహాయ విషాదం.. చేస్తుంది పోరాటమ్…!

భరతజాతి నివాసం..అవుతోంది అవినీతిసహవాసమ్..!

మంచి కోరెను ప్రదేశం.. ఈ నా పవిత్రమైన.. సందేశమ్….!.””విలాసాల””

విలాసాల మత్తు వదలరా…యువకుడా..!

స్వాభిమానం భారతాన్ని జగతిలో నీ నిలుపురా సోదరుడా..!