జయహో భారతమాత – కవిత

జయహో జయహో భారతమాతకు జయహో…

గాంధీ శాంతి రాజ్యమా… అమరేశ్వరుడి అమరమా…

సుభాష్ చంద్రబోస్ పౌరుషమా.. వీర జవానుల నిర్మాణమా…

కృష్ణానది పుష్కరమా..అబ్దుల్ కలం ఆరాధ్యమా…

ఉక్కుమనిషి విలీనమా..మోహన్ రాయ్ సంస్కరణమా…

జయహో జయహో స్వతంత్ర భారతానికి జయహో…

బంకించంద్ర వందేమాతరమా.. లోకమాన్య ఉత్తేజమా…

నైటింగేల్ సాహిత్యమా.. మనికర్ణిక ధైర్యమా..

జాతీయ గీత రవీంద్రమా.. బాబాసాహెబ్ జ్ఞానమా…

ఆర్యభట్టు శాస్త్రమా.. పింగళి వెంకయ్య పతాకమా…  

ఆచార్యులకు ఆచార్యుడైన నాగార్జునుడి నిలయమా…

జయహో జయహో స్వతంత్ర భారతానికి జయహో…

సర్వమత సమ్మేళనమా.. నవ రాజ్య చైతన్యమా…

శిల్ప సోయగమా.. దివ్య నదుల ప్రవాహమా…

భూలోక స్వర్గమా.. భావి పౌరుల ఆశ కిరణమా…

సర్వ కళల క్షేత్రమా.. జ్ఞాన మనో నేత్రమా…

కావ్య కళ శోభితమా.. రత్నాల గర్భమా…

జయహో జయహో స్వతంత్ర భారతానికి జయహో…

శాలివాహ.. శాతవాహ.. కాకతీయ.. కృష్ణరాయ…

ఎందరో  పరిపాలించిన దివ్య శోభ భరతమా…

యెంతని చెప్పను నీ విశ్వ ప్రఖ్యాత చరితము…

నీవే నీవే రేపటి భావి తరాల అన్నపూర్ణమా…

ఓ భారత రాజ్యమా.. మా కోహినూరు వజ్రమా…

విశ్వంతరాలలో నిరతం ప్రకాశించుమా…

నీకు ఇదే ఇదే ఈ అఖిలాశ కవితాభిషేకం..!!