జీవన ముప్పు – కవిత

ఏది గొప్ప? 

మంచి చెయ్యడం లేదని చెప్పడం తప్ప

ఏది మంచి?

చెడుకు తలవంచి మంచిని కంచికి పంపడం తప్ప

ఎందుకు చెడు?

చేతపట్టి నడవడానికి ముందుకు

ఇదే నీ నినాదం ఐతే …….మరి నీ జీవితకథనం ఎక్కడకి

మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ, చెడు చేసినవారిని దుయ్యకపోవడం తప్పు .

గుర్తుంచుకో ఆ తప్పు ఏదోరోజు నీ జీవనానికి ముప్పు.