జీవిత సత్యం – కవిత

నీ తలరాత ఏదైనా మార్చాలన్నా, చెరపాలన్నా లేదా తిరిగివ్రాయాలన్న

ఆయుధం నీచేతుల్లో ఉందన్న విషయాన్నీ మరువకు. ఇదే జీవిత సత్యం

భగవంతుడు మంచిరాసి నిను సృష్టిస్తే

చెడుగా మార్చుకొంటున్నావు.

అది అనుసరించిన నీ పిల్లలు లేదా నీచుట్టూ ఉన్నవాళ్లు

మంచివారిగా ఎలా బ్రతకగలరు .

మంచి సృష్టించినవారిని భగవంతుడు అంటాము

చెడుగా మార్చిన నిన్ను యేమని పిలవాలి.

దేవుడవవుతావో లేదా దెయ్యంగా మారతావో తెలుసుకో…