జీవితం – కవిత

జీవితం ఆశ్చర్యాలతో  నిండిన ఓ మహా సాగరం..

అంతుచిక్కని ఆశలు ఆశయాలు కలగలసిన సముదాయం.. 

అంచనాలకు అందనిది  ఈ మాయా ప్రపంచం..

అవర్ణనీయమైన పద్మవ్యూహం ఈ జీవితం..

మరు నిమిషాన ఏమి అగునో ఊహించలేని ఓ అసమాన అనివార్యమైన ప్రయాణం…..

“ఒక నిమిషం చెప్పరానంత ఆనందం

మరు నిమిషం చెప్పుకోలేనంత భాధ….”

“ఓ గడియ పొట్ట పగిలేంత నవ్వు

ఆవెంటనే కంట నీరు వరదై పారే కష్టాలు….

“ఒక సమయాన అదృష్టంతో వరించే అవకాశాలు

మరో సమయాన కష్టాన్ని గండి కొడుతూ వచ్చే దురదృష్టాలు..”

“ఓ క్షణం అన్నీ కలిసొచ్చే సౌకర్యాలు

            ఇంకో క్షణం బ్రతుకంటేనే భారం అనిపించే భంగములు…”

“కొన్ని మనసులో ఎప్పుడూ నిలిచిపోయే మధుర సంఘటనలు

            మరికొన్ని మనసును ఎల్ల కాలం కంపింపచేసే దుర్ఘటనలు ……”

కేవలం గెలుపోటములు జీవితాన్ని నిర్ణయించలేవు…..

నిజానికి కష్టసుఖములు జీవన విధానాన్ని  మార్చలేవు……

అనుకోకుండా జరిగే సుసంఘటనలు, దుర్గటనలు జీవన ప్రయాణాన్ని ఆపలేవు…

అవస్యం  శుభాశుభములు జీవనాన్ని మహనీయం చేయలేవు…..

“అవుననిన కాదనిన ఇదే కదా మన జీవితం”

వాస్తవంగా “కోరినవన్నీ సాధ్యమైతే మానవుడు కూడా మాధవుడే కదా ???”…..