కాలం – కవిత

కదిలే కాలానికి కనకంబు కూడా సరిసమానం కాజాలదు

కాలక్రమేణా మన నిర్ణయాలే జీవన శైలిని మార్చగలవు

ప్రతి నిర్ణయం అనుభవించే సుఖదుఃఖానికి కారణం కాదంటారా

గడిచిన కాలమైన వర్తమానమైన ఏదో ఒక జీవిత సత్యాన్ని భోధిస్తుంటుంది

సంభవించు ముప్పులకు ఎదురీదని వేళ భవిష్యం ఏ విధంగా సాఫల్యం కాగలదు

మనుగడ ఉన్నచోట ముప్పులు సహజం..

మరి ప్రతి ముప్పుకి పరిష్కార మార్గములు కూడా అనేకం

అనునిత్యం ఏదో ఒక రూపాన అవకాశాల జల్లును కురిపించును కాలం

అవివేకంతో ఆపేక్షలకు బానిసై కాలక్షేపం చేస్తే అవకాశాలు చేజారావంటారా

సంయవనాన్ని కొలిపోక కాలానుగుణంగా నడిచిన వేళ జీవనం సఫలీకృతంగా మారును కదా