కడలి – కవిత

ఎప్పుడూ నీ ఆలోచనలతో సాగిపోతున్న వాగులా ఉంటుంది మది..
ఏదైన చెయ్యాలంటే, మరి కుదురుగా ఉండాలి కదా అంటానా..?
ఒక్కసారి నీ గొంతు వింటే చాలని ఆరాటపడుతుంది..
విన్నాక, ఉప్పొంగే గోదారిలా పరిగెడుతుంది.
ఇప్పుడు, నిన్ను చూసేస్తే ఇక నాకు అడ్డుపడనని కొత్త పల్లవందుకుంటుంది..
నిజమేనేమోనని నేనూ నమ్ముతాను.
కానీ, నీ కళ్ళలోకి చూడగానే కల్లోల కడలిగామారిపోతుంది..
అన్నివైపుల నుండి నన్ను ఒక్కసారిగా ముంచేస్తుంది.