కలగంటి… – కవిత

Author
C. Naveen Kumar

Last Updated on

కలగంటి కలలోనే చైతన్యమనే కాంతిని గంటి,

ఉప్పెనవలె ఉద్యమిస్తున్న రైతుల ప్రభంజనం గంటి,

అవినీతి రాబందుల రెక్కలు తెగపడటం చూడగా గంటి ,

ధర్మ స్థాపనకై ప్రతి పౌరుడు పరుశురాముడివలె కదులుతున్నట్టి దృశ్యం గంటి ,

మరణించిన మతోన్మాదుల శవాలపై నాట్యం చేయు నన్ను నేను గంటి ,

పైశాచిక మృగాలపై మగువల దండయాత్రను గంటి ,

ఈ రణరంగానికి మూలమైన యదరగిలించే నా కవితను చదువగగంటి ,

కలగంటి కలలోనే చైతన్యమనే కాంతిని గంటి

Leave a Reply