కర్తవ్యం – కవిత

Last Updated on

మెల్లమెల్లగా గగనతారాలు ఆరిపోతుంటే

నీలాకాశం బోసిపోతుందేమో అనుకున్న నిమిషాన

ఎర్రటి పండు పురుడు పోసుకొని

నల్లటి మబ్బులలో నుండి..

తన చూపులను ధరణి వైపు వేసాడు..

నిర్జీవంగా నిద్రిస్తున్న నా దేహాన్ని

రుధిరలోకం తట్టి లేపి మదనలోకం వచ్చినది

విధి నిర్వహణకై అడుగులు వేయమన్నది.

1 thought on “కర్తవ్యం – కవిత”

Leave a Reply