కుంపటి – కవిత

అర్ధరాతిరిలో నిద్రరానీక

గుండెల్లో బాధ కళ్ళలో కుంపట్లైతే,

రెప్పలతో ఆర్పేద్దామని ప్రయత్నించానా..

నిప్పులన్నీ నీళ్ళుగా కరిగి  పోతున్నాయి  

నిద్ర దేవత దూరం నుండి ఈ చోద్యం చూస్తోంది..

దరిదాపులకైనా రానంటోంది.