లే… లెయ్ రా లే – కవిత

లే…

లెయ్ రా లే

అడుగులు వేస్తూ

పరుగులు పెడుతూ

ఉన్న స్థానం వీడుతూ

గతమన్నది పనిలేదని

నేడన్నది ముఖ్యమని

బాటలు వేస్తూ

బీజం నాటుతూ

కనివిని ఎరుగని

చరిత్ర పుటలని

లిఖిస్తూ

దూసుకెళ్ళరా ముందుకు

దూసుకెళ్ళరా ముందుకు