మానస సమీరాలు – పుస్తక సమీక్ష

          పోపూరి మాధవిలత గారు రాసిన కవితా సంపుటి మానస సమీరాలు లోని కవితలన్నీ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. మొదటి కవితతోనే ప్రజలను చైతన్య పరిచే శీర్షిక ఎంచుకోవడంలోనే కవయిత్రికి సమాజంపై తనకున్న ప్రేమను తెలిసేలా చేస్తుంది. రండి ఓటేద్దాం అంటూ ఓటు విలువ గురించి ఇలా అంటారు నీవు ఓటేయడానికి వెళ్ళేటప్పుడు మక్కాకు  వేల్తున్నంత మహా సంకల్పంతో వెళ్ళు అంటూ ఓపికగా వరుసలో నిల్చున్నప్పుడు వైకుంఠ దర్శనం కోసం వేచి ఉన్న అని అనుకో ! పోలింగ్ బూత్ లో అడుగు పెట్టినప్పుడు స్వర్ణ దేవాలయంలో ఉన్న అనుకోని పవిత్ర హృదయంతో నీ ఓటు హక్కు వినియోగించుకో అని కుల మత సామరస్యాన్ని చాటి చెప్తూ కవిత రాసిన విధానం కవియిత్రికి ఉన్న అనుభవం తెలియజేస్తుంది.

రోజు మన ఇంటికి సూర్యుడు రాకముందే వచ్చి మన వాకిట్లో అక్షరాలను చల్లి పోయే పేపర్ బాయ్ గురించి రాసిన కవితలో తన కష్టాన్ని కళ్ళకు కట్టి చూపించిన తీరు అమోఘంగా ఉంది. అమ్మ నాన్నల పై ఎన్ని కవితలు రాసిన ఎంత మంది రాసినా మనల్ని చదివిస్తూనే ఉంటాయి. అలాంటి నాన్న గురించి వారిపై మన బాధ్యత గురించి కవితలో అందంగా అలంకరించారు. సవాలు కవితలో పకృతి గురించి ఉపయోగించిన ఉపమానాలు అథ్భుతంగా ఉంది. నమ్మకం కవితలో నిజాన్ని బట్టబయలు చేసి చెప్పారు. ఇలా అన్ని సామజిక కోణాలు వారి కవితా వస్తువులలో దర్శనమిస్తాయి.

కొలతలు కవితలో మగువ ఆలోచనల లోతును కొలిచే యంత్రము లేదని చెప్పిన తీరు బహు చక్కగా ఉన్నది. వీరి కవితలలో చివరి లైన్స్ లో ఒక మెరుపు మేరిపిస్తారు అది రీడర్స్ ని ఆకట్టుకుంటుంది. కవయిత్రి నిజాలన్ని కవిత్వంలో రాసి మనపై కుమ్మరించారు. పుస్తకంలో మొత్తం డెబ్బై కవితలు ఉంటే దాదాపుగా అన్ని సామజిక అంశాలపై తన స్పందించారు. నేతన్నపై రాసిన కవిత కన్నులలో నుండి కన్నీళ్ళు రాలిపడేలా చేస్తాయి. తెలుగు వెలుగు, చిట్టి చిన్నారులు, చివరి మజిలి, మరల వస్తాను, మూగవోయిన వీణ, నిధి పెన్నిధి లాంటి కవితలు రీడర్స్ ని ఆకట్టుకుంటాయి. కవయిత్రి పోపూరి మాధవిలత గారు మరెన్నో కవితా సంపుటులు సాహిత్య వనానికి పరిచయం చేయాలి అని కోరుతూ…!!

1 thought on “మానస సమీరాలు – పుస్తక సమీక్ష”

  1. జానీ, బాగుంది. కంగ్రాట్స్

Comments are closed.