Author
గగనం లోని విహంగాలు
తిరిగి గూడు చేరుతున్న…
మదిని దాటిన తలంపు
భువిని చేరటమేలేదు….
ఆటుపోట్లతో అల సంద్రమున
తీరం తాకుతున్న…..
ఊపిరి ఊహల మనుగడ
తనువుని తాకటమే లేదు….
ఆకులు రాల్చి వృక్షాలు
కాలానికి నిలబడుతున్న
కలలు లేని జీవితంలో
కనుబొమ్మలు మూతపడటం లేదు
రూపం లేని ఊసుల కోసం
వెతుకుతుదామన్న…
ఊపిరిలేని ఊసులు
ఉనికి కనపడటంలేదు …….