మోడ్రన్ మెథడ్… ఓల్డెన్.. డ్రీమర్… – కవిత

నవ జీవన వేదం సారాంశము

మన జీవిత వేదనారంభము..

ఆకాశమే ఒక ఆవేశమై..

భవిష్యత్తుకే ప్రోత్సాహమై…

అందాలు కలిగీ అన్నింటిలో…

ఏకత్వమే లేని భారత మాతింటిలో…

ధనమంటివీ .. నీవు..మతమంటివీ..

కులమంటి వివక్ష కనుగొంటివీ

శిక్షాగునా… నిన్ను రక్షించునా…

వీక్షించే జనులైన దీక్షించునా…

నిన్ను రక్షించునా…

టెక్నాలజీ లోన తెగువే లెదూ…

సృష్టించే అంశాల కొదవే లెదూ…

చదువంటివీ..నీవు.. స్థాయంటివీ…

నినుగన్న తలిదండ్రి నే మరిచితివీ…

అమ్మా నాన్న నీకు ఇరుకన్నులు..

కళ్ళని మరిచితివి అంధుడవై…

నీవు అంధుడవై…

యువతే కదా నేడు ఘనచరితవ్వనీ..

కాని మంచిని పంచేటి మమతవ్వనీ…

భారతావనీ..మన జనతావనీ..

జై హింద్ అనీ జగమంత చాటివ్వనీ..

మన భారత్ యే నీ పదమవ్వనీ…

జై భారత్ యే మన సర్వమవ్వనీ..

మన స్వరమవ్వనీ..

వాహనాలే నీవు నడుపుతున్శావు.

రోడ్డు నియమాలనే పాటించవు…

ప్రమాదాలే రోజుకెక్కువయ్యెనే..

రోడ్డు రహదార్లె నరబలి కోరెనే.

ఇవిఆగవా..నీర్లక్ష్యమాగదా…

మనిషికి బ్రతుకంటె విలువే కదా..

మన జగతికి విలువేకదా..

మన దేశమే ఆ ప్రాచీనమే..

ఆ ఘనత యే మన సొంతమే..

అపకారమే మనకనవసరమే..

ఉపకారమే మన అద్భుతమే..

రోషమెక్కువా..ఆవేశమెక్కువ..

ఓరిమిని కలిగేటి గుణమెక్కడా..

భవితని నిలిపేటి గుణమెక్కడా..

1 thought on “మోడ్రన్ మెథడ్… ఓల్డెన్.. డ్రీమర్… – కవిత”

Comments are closed.