మౌనమే నా భాష – కవిత

నీతో పెంచుకున్న ప్రేమని

కాదని నువ్వెళ్ళి పోయినా 

నీతో గడిపిన మధుర క్షణాలు

జ్ఞాపకాలుగా మనసున నిక్షిప్తమయ్యాయి

నాలో పెంచుకున్న ఆశలను

నువ్వు ఆడియాసలు చేసినా

ఆ ఆశలే కలలుగా మారి

నాకు తోడయ్యాయి

నీతో పెనవేసుకున్న బంధాన్ని

తెంచుకుని నన్ను కాదనుకున్నా

నీ కోసం నే కార్చిన కన్నీళ్లే

నా హృదయానికి ఓదార్పునిచ్చాయి

నన్ను కాదని వెళ్లిపోయిన నీ కోసం 

మౌనమే నా భాషగా

మనసున యుద్ధం చేస్తూ

కలకాలం బ్రతికేస్తా….