ముఖచిత్రం… కథ | 7-2017

ముఖచిత్రం... కథ | 7-2017

   ఈ మాసం ముఖచిత్రంను కూడా గత మాసం మాదిరిగానే అన్ని రచనలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించాము. కానీ ఈసారి ముఖచిత్రానికి ఒక రూపం ఇవ్వడానికి మునుపటి కంటే ఎక్కువ సమయం పట్టింది. చాలా ఆలోచిస్తేగానీ అన్ని రచనలకు సంబంధించిన చిత్రాలను ఒక్క చిత్రంగా కూర్పు చేయడం కుదరలేదు.

     నా సోదరుడు రాసిన ధారావాహికకు అనుగుణంగా అందులోని రెండు పాత్రల బొమ్మను వేసాము. సూర్య తేజ మొక్క గారి ధారావాహికకు సముద్రగర్భంలో ఉన్న గుహను వేసాము. అంబడిపూడి శ్యామసుందర రావు గారి వ్యాసానికి ఓ సౌమేధకుడిని వేసాం. ఎందుకంటే రుద్రాక్షలు హిందువులకు చాలా పవిత్రమైనవి. ఎలా వేయాలో అర్థమవలేదు. మొదట ఇంట్లో పూజా మందిరంలో ఓ చోట పెట్టినట్టు దించాలని భావించా. కానీ ముఖచిత్రంలో ఈ బొమ్మ కలిసిపోయేటట్టు ఉండదు. అలాగే పూజా మందిరం వద్ద ఉండటం కంటే ఓ జపి చేతిలో ఉంటే బాగుంటుందని ఆలోచించి ఋషి పుంగవుడిని వేయడం జరిగింది. జానీ తక్కెడశిల గారి కవితకు చెట్టు కింద కూర్చున్న ఓ తరుణినీ, తెలుగు భాష పై రాసిన శ్రావ్య గారి కవితకి పుస్తకం చదువుతున్న సుమతిని, నీలిమా అనిల్ గారి కవితకు సముద్రకాంతను, కుందేటి వెంకట కల్యాణి గారి శీర్షికకు జీర్ణుడుని, సుకుమారుడుని వేసాము. ఇలా అందరి రచనలకి మేము వేసిన బొమ్మలన్నింటిని కలిపి ఈ జులై మాస ముఖచిత్రాన్ని రూపొందించాము.

     అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము…