Muralidharaa poem by Suma Nalluri

మురళిధరా  !!!

మురళిధరా  !!!

గీత అనే ప్రేమ లేఖ తో నా మది  ఉక్కిరి బిక్కిరి చేసి…
నన్ను  నాకే  కొత్తగా  ఈ  ప్రపంచానికి  పరిచయం చేసిన క్షణం…
భావాలకు అందని భాషతో సతమతమవుతున్న సమయాన,
నీ వేణు గానంలో, అక్షర భాష్యం చదివించిన  వేళ… 
తడబడుతున్న నా అడుగులను,
నీ నాట్య భంగిమ తో లయబద్దం చేసిన మధుర క్షణాన…
నీ కనుల ఆకర్షణ, చూపు తిప్పుకోలేని మైకంలోకి  నన్ను నెట్టివేస్తుంటే…
గుక్క తిప్పుకోలేని, నా చిన్ని గుండె దీపమై ఒకే ఒక్క రోజైన,
నీ పాదపద్మముల ముందు నిర్యాణం కావాలని ఆకాంక్షిస్తూ…
మీ  ప్రేమ లేఖను ఆనంద భాష్పాల నడుమ ముగుస్తున్నా !!!! 

కవిత రచన: సుమ నల్లూరి