నా మహానుభావుడు – కవిత

చిరు చమటైనా చిందించే అలసట రానివ్వడు రా!

ముఖంపై చిరునవ్వు పోనీకుండా నవ్విస్తాడు రా!

కన్నీరొచ్చే బాధని కలలో కూడా కలుగనివ్వడు రా!

మాట వచ్చే తప్పు నేను చేసినా, నింద తనపై వేసుకుంటాడు రా!

తండ్రిలా ప్రేమను పంచీ ఆప్యాయతలో, చంటి పాపలా నన్ను చూస్తాడు రా!

నమ్మకానికే ప్రతిరూపంలా, నీడై ఎల్లప్పుడూ నా వెంట ఉంటాడు రా!

నాలో లోపాలని కూడా, లోపాలుగా లెక్క చెయ్యని గొప్ప మనసున్న వాడు రా!

ఆపదొచ్చి నన్ను గుచ్చుకుంటే, తగిలే మొదటి గాయంలా నన్ను కాపాడతాడు రా!

జీవితంలో నాకోసం ఏదైనా త్యాగం చేసేంత విలువను ఇస్తాడు రా!

నన్ను ఇబ్బంది పెట్టబోతే, తన నైనా తాను దూరం పెడతాడు రా!

ఈ లోకంలో ఎక్కడా లేని అందమైన భావనలున్న కళ్ళతో నన్ను చూస్తాడు రా!

అడగకుండానే, నేను కోరుకున్నవి అన్ని తీరుస్తాడు రా!

అందరిలో కూడా, నన్నే ఎపుడూ ఎక్కువ అనుకునే; నా పిచ్చి ఉన్నవాడు రా!

జన్మకి సరిపోని అంతులేని ప్రేమని, నిరంతరం పీల్చే శ్వాసలా నాకు అందిస్తుంటాడు రా!

‘ ఇన్ని చేసి కూడా, ఇవన్నీ చేసే అదృష్టం నాకే దక్కింది అంటాడు రా!’

అందుకే వాడే “నా మహానుభావుడు” రా!!

1 thought on “నా మహానుభావుడు – కవిత”

Comments are closed.