నాన్న | కథ | శ్రీధర్. ఆర్

నాన్న

ఒక మిత్రుడు నాతో ఇలా అన్నాడు … నీకేంట్రా డబ్బు , ఆస్తి , ఐశ్వర్యం అన్ని ఉన్నాయ్ అదృష్టవంతుడివి అని…

అక్కడ మొదలయ్యింది ఈ కథ…

నేను: ఒక వ్యక్తి జీవితం లో అన్నిటికంటే అదృష్టమైనది ఏంటో తెలుసా. ఎన్ని కష్టాలొచ్చినా వెన్నెముకలా నిలబడి, ఏది ఏమైనా నీకు నేను ఉన్నాను అని నడిపించే ఒక బలమైన నాన్న ఉండటం …

మరి అన్నిటికంటే దురదృష్టమైనది….?

అలంటి నాన్న లేని ఇంట్లో భాద్యతలు మోసే పెద్ద కొడుకుగ పుట్టడం…

డబ్బు, ఆస్థి, ఐశ్వర్యం ఇవేమి లేకపోయినా ఒక బలమైన నాన్న ఉండడం ఎందుకంత ప్రత్యేకం?

నాన్న అంటే ఒక ధైర్యం, పడిపోతే పట్టుకుంటాడనే నమ్మకం, మనం వెళ్లే ధారి సరైందో కాదో చెప్పే ఒక గురువు .. కష్టం వస్తే తలా వాల్చుకునే ఒక భుజం… 

నే ఎప్పుడు గెలవాలని కష్టపడలేదు… ఒక నాన్నగా  పిల్లలు దగ్గర ఓడిపోకూడదని కష్టపడ్డాను…

వాడు: రెండిటికి తేడా ఏంటో?

నేను: ఒకటి గెలుపు కోసం పరిగెత్తడం … రెండోది ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెక్కు చెదరకుండా నిలబడడం…

నాకు మొదటిది ఇష్టమైన, రెండోది అవసరం… ఈ రెంటి మధ్య నలగటమే జీవితమేమో….

వాడు: మరి నీకంటూ ఆశలు లేవా?

నేను:  చిన్న వయసు నుండి భాద్యతలు మోసే కొడుకుకి ఏముంటాయిర ఆశలు, ఏముంటాయి ఇష్టాలు ..చేతిలో డబ్బున్న ఖర్చు చేయాలనే  ఆశ ఉండదు, ఎప్పుడైనా ఆశ కల్గిన పిల్లల కోసం మనం  కనే కలలో ఆ ఆశ కొట్టుకు పోతుంది…

పిల్లలికి మనం ఇచ్చే ఆస్థి ఏముంటది రా.. వాళ్ళ ఆశల కోసం పరిగెత్తే స్వేచ్ఛ , పడిపోతే పట్టుకునే చేయి, ప్రయత్నించినా ఓడిపోతే నేను ఉన్నాను అనే ఒక భరోసా…

ఒక తండ్రిగా మనం పిల్లలికి  ఇంత కన్నా ఏమి ఇవ్వగలం… తన కొడుక్కి ఒక బలమైన నాన్నగ మిగలటం తప్ప…

అది చేసిన రోజు తనకు దొరకని బలం తన రూపంలో తన పిల్లలకి ఇస్తే.. అదే కదా నిజమైన విజయం…

ఒక బలహీనమైన కొడుకు బలమైన నాన్నగ మారిన రోజు…

బాధ్యతగా ఉండే ప్రతి కొడుకు కి  ఇది అంకితం….

రచన : శ్రీధర్. ఆర్