నీ రాకకై – కవిత

Author
Sesi Saradi

Last Updated on

ఇంకా నా కనులలో నీ రూపు

నింపుకొననేలేదు.

ఇంకా నా హృదిలో నీ మోము

ముద్రించనేలేదు .

ఇంకా నీ చేతులలో చెయ్యివేసి

నడువనేలేదు.

ఇంకా నీ సాన్నిహిత్యం లోని

మాధుర్యాన్ని అనుభవించనేలేదు.

ఇంకా నీ పరీరంభణములోని

తియ్యదనాన్ని ఆస్వాదించనేలేదు.

ఇంకా నీతో సహజీవనము

ఆరంభించనేలేదు.

ఇంతలోనే,

సమయము ఆసన్నమైనది

కాబోలు,

నా రాకకై

పుష్పక విమానము

వేచిఉన్నది.

సమయము మించక ముందే

ఒక్కసారి నువ్వు వస్తే

తనివి తీరా నిన్ను

కన్నులలో నింపుకుని

ఎవరూ కానని లోకానికి

తృప్తిగా తరలి పోతాను.

Leave a Reply