నేను నా ఊహ – కవిత

నీ చెక్కిలిపై జారిన నీటి చుక్క చాలు

నాలో పడి మొలిచిన కోర్కెలు బ్రతికేందుకు

నీ నుదుటి ఛాయ చాలు

నా జీవన గమనంలో ఉదయించేందుకు

నీ కురులు చేసే అలజడి చాలు

నీకై నా గమ్యాన్ని చేరేందుకు

నీ ఆనవాలు చాలు

నా ఉనికిని నే కనుగొనేందుకు

నీ కనుచూపు చాలు

నా కడదాక నీకై కలత తీరేందుకు

నీ గాజుల సవ్వడి చాలు

నా గుండె స్పందన నిను కలిసేందుకు

నీ ఊహల శ్వాసలు చాలు

నాకు ప్రాణవాయువై నే బ్రతికేందుకు…….