నేస్తం! – కవిత

కాలం వేగంగా కదులుతోంది

ప్రకృతి తన రూపు మార్చుకుంటోంది

వసంతం గ్రీష్మమైంది

హేమంతం శిశిరమైంది

కానీ!

నీపై నా ప్రేమ మారలేదు

నీకై ఎదురుచూపు ఆగలేదు

వర్షాకాలపు చిరు చినుకువై

శరత్కాలపు వెండి వెన్నెలవై

నాకోసం వస్తావని, నీ ప్రేమను తెస్తావని

ఎదురుచూసే నా మనసూ మారలేదు

2 thoughts on “నేస్తం! – కవిత”

Comments are closed.