Neti taram poem by Sravani Boyini

నేటి తరం

ప్రమాణం లేనీ పుస్తకాలు …
అర్తం కానీ  పాఠ్య ప్రణాళికలు …
గ్రేడ్ ల  కోసం పరుగులు ..
అర్థం కానీ చదువులు ..
తలకెక్కని పాఠ్యంశాలు…
జ్ఞానం లో వెనుకంజ…

ఆత్మ విశ్వాసం లేని విద్యార్థులు …
తల్లిదండ్రులు పై ప్రేమ లేని పిల్లలు..
గోప్యత కె ప్రాముఖ్యత…
అమ్మ తో పంచుకోని విషయాలు ఎన్నో …
నాన్న తో దాచిన సంఘటనలు …
చరవాణి మత్తులో చదువు కి దూరం గ ..
సినిమాలకు షికార్లకి కి చేరువలో …

వెన్నల లాంటి భవిష్యత్తుని చీకట్లోకి తోసి …
బంగారు లాంటి జీవితాన్ని బూడిదలో కలుపుకుంటూ…
పుస్తకాల పురుగులు కానరారు ..
సమయ పాలనా ఎరుగరు …

సమయపాలనతో ముందడుగు …
ఆశయం కన్నా నమ్మకం గొప్పది …
నమ్మకమే  గమ్యానికి చేరుస్తుంది …
అభద్రతని, అధైర్యంని జయించి ముందుకు సాగాలి ..!

కవిత రచన:  శ్రావణి బోయిని