నువ్వే నేను, నేనే నువ్వు… – కవిత

నిన్ను చూసాక కలగన్ననా???

          కలలో నిన్ను చూశానా???

ఏది ఏమయినా

         నా హృదయాన్ని మాత్రం దోచుకున్నావు

నా ప్రతి క్షణం నీదే అన్నావు..

     నీ ప్రతి ఆనందం నాదే అన్నావు..

నా ప్రతి అనుభవం నీదే అన్నావు..

    నీ ప్రతి చర్య నా కోసమే అన్నావు..

నా ప్రతి నవ్వు నీదే అన్నావు..

    నీ ప్రతి పలుకు నాకే అన్నావు..

నా ప్రతి హృదయ స్పందన నీదే అన్నావు..

    నీ హృదయంలో నేను మాత్రమే ఉన్నానన్నావు..

నువ్వు లేనిదే నేను లేను అన్నావు..

నువ్వే నేను, నేనే నువ్వు అన్నావు..

ఇంతగా ప్రేమించిన నువ్వు ఇలలోనే కాదు 

కలలో కూడా కానరావెందుకు???