ఓ కల… | రచన : శిరీష

ఓ కల…

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆలోచన,ఆచరణ, అసంతృప్తి తో నిండిన ఓ మనసుని నిద్ర పుచ్చడానికి రాస్తున్న కల

వేకువ జామునే వచ్చి నా అధరాన విరిసె ఆనందాన్ని తాకి వెళ్ళే కమ్మటి గాలిని చూసాను

జన్మభూమి రక్షణ కోసం పోటీ పడుతున్న నేలతల్లి బిడ్డ లను చూసాను

వారిని మంచు పుష్పాలతో సన్మానిస్తున్న గగనాన్ని చూసాను

తాము చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నందుకు ఆ విరులు వ్యక్తపరుస్తున్న సొగసులోని అందాన్ని చూసాను

పుష్పాలతో పోటీ పడి తమ మధురమైన సరిగమలతొ అర్చిస్తున్న తుమ్మెద లను చూసాను

వారితొ శృతి కలిపి మానవాళి మైమరచేలా మురళి గానం చేస్తున్న కోయిలను చూసాను

అటు గా వచ్చిన ఓ తల్లి తన బిడ్డా ఇన్ని ప్రాణులచె గర్వించే సైనికుడు అవ్వాలని కోరుకునే ఆమె ఆనందాన్ని చూసాను

ఇవన్నీ మందహాసం తో వీక్షిస్తున్న విశ్వేశ్వరా……

నీ నయనం లొ సంకల్ప బలం తొ వికసిస్తున్న జవానుకి  శుభోదయం చెప్పడం చూసాను

ఉషా కిరణాలను తాకి మురిసిన నా ప్రపంచాన్ని చూసాను

మరుక్షణం నన్ను బుజ్జగిస్తూ మేల్కొలుపుతున్న మా అమ్మ ను చూసాను. 

రచన: శిరీష
(కలం పేరు – “ఉష“)