ప్రేమికుల రోజు – కవిత

ప్రేమికులందరు Valentine’s day కోసం ఎందుకు ఎదురుచూస్తారో తెలియదు

నిన్ను కలవని క్షణం ముందు వరకు

నీ గురించి ఆలోచించే ప్రతి ఆలోచన ఆనందంగా వుంటుంది

నీ ఊహలతో ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది

అందంగా కనిపించే వాటిని కళ్ళతో మాత్రమే చూస్తాం

కానీ ప్రేమించాలనే వాటిని మనసుతో చూస్తాం

కళ్ళతో చూసి ప్రేమించే వాడు నీ గురించి ఎంతయినా పొగుడుతాడు

కానీ మనసుతో చూసి ప్రేమించే వాడికి మాటలన్నీ మౌనమైపోతాయి

ప్రతి అమ్మాయి తనని ప్రేమించే వాడు తన ప్రేమని ఎలా express చేస్తాడో అని ఎదురుచూస్తూ వుంటుంది

కానీ ఈ ప్రపంచం లో express చేయలేని feeling ఏదైనా ఉంటే అది ప్రేమ ఒక్కటే

Propose చేసే ప్రతి వాడు భయపడుతూ ఉంటాడు

ధైర్యం లేక కాదు

తాను కాదంటే మిగితా జీవితాన్ని ఎలా బ్రతకాలో తెలియక

అందుకే ప్రేమించే ప్రతివాడికి ధైర్యం ఉండాలి

అది అమ్మాయికి తన ప్రేమను చెప్పడానికి అయినా

తను కాదంటే జీవితాన్ని ఎదిరించడానికి అయినా

ఆ ధైర్యం నాకుంది

ప్రేమించడానికి కారణాలు ఉండవు

ప్రేమను చెప్పడానికి మాటలు కూడా ఉండవు

ఈ ప్రపంచం లో ఎవరూ తన ప్రేమను నేరుగా చెప్పలేరు

ఎందుకంటే ప్రేమిస్తున్న వాళ్ళ కనులని చూస్తే మనల్ని మనమే మరిచిపోతాము

నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అమ్మాయి నన్ను చూసినప్పుడు

నా గుండె చప్పుడు చిరుతపులి కన్నా వేగంగా పరిగెడుతుంది అని

తనతో  మాట్లాడే చిన్ని మాట కోసం ఎన్ని ఏళ్ళు అయినా వేచి ఉండొచ్చు అని

తనతో జీవించే జీవితం కోసం ఎన్ని జన్మలు అయినా జన్మించొచ్చని

ఇవన్నీ ఒకేసారి నాలో కలిగిన క్షణం

నిన్ను చూసిన మొదటి క్షణం

ఒక్కసారి నన్ను ప్రేమించడానికి try చెయ్యవే

ప్రపంచం లో ఎవరు కూడా ఇంతగా ప్రేమించలేరు అన్నట్టుగా ప్రేమిస్తా

ప్రాణం పోయేవరకు ప్రేమిస్తూవుంటా

ఊపిరి విడిచే వరకు నీ గురించే ఆలోచిస్తూ వుంటా

I  LOVE  YOU  EVER  & FOREVER

HAPPY VALENTINE’S DAY 

ఇట్లు
ఒక ప్రేమికుడు