ప్రియతమా నాలోని భావమా – కవిత

విరిసే నీ నవ్వులు ముత్యాల పువ్వులు

జారే నీ కురులు మెరిసే మిణుగురులు

పలికే నీ పలుకులు రత్నాల కులుకులు

నా ముంగిట నీ అడుగులు నా యెదలోని వెలుగులు

ప్రియతమా నాలోని భావమా