పుణ్యభూమి మన తెలుగు భూమి – కవిత

తెలుగు పలుకుల విలువ వెలకట్ట లేనిది 

తెలుగు జాతి గౌరవం వివరించలేనిది 

త్యాగరాజు కీర్తనలతో నిండివున్నది 

గోవిందుడిని వివరించిన అన్నమయ్యది 

గుంటురులో జన్మించిన జాషువధి 

ధైర్యంగా కాల్చమన్న సీతారామరాజుది 

కంచరగొపన్నగా ప్రసిద్ధి చెందిన రామదాసుది 

అదే ఈ పుణ్యభూమి మన ఆంధ్రభూమి….. 

అదే ఈ పుణ్యభూమి మన తెలుగు భూమి….. 

నన్నయ్య తిక్కన పోతన కవులది 

ముందు వచ్చిన తిమ్మక్కది 

కడప నుండి వచ్చిన మొల్లది 

విశ్వదాభిరామ వినురవేమ అన్న వేమనది

కన్యాశుల్కం వ్రాసిన గురజాడది 

అదే ఈ పుణ్యభూమి మన ఆంధ్రభూమి….. 

అదే ఈ పుణ్యభూమి మన తెలుగు భూమి….

త్రయంబకం నుండి వచ్చిన గోదావరిది 

క్రిష్ణ, పెన్న తుంగభద్ర నదులది 

పాపికొండలది ఏడుకొండలది

మాటలురాని పసిపాపలది 

విద్యాబ్యాసం చేస్తున్న విద్యార్దులందరిది 

దేశంకోసం ప్రాణాలర్పించే సైనికులది 

ఏమీ తెలియని నాలంటి అభాగ్యులందరిది 

అన్నీ తెలిసిన మీలాంటి  జ్ఞానులందరిది 

అదే ఈ పుణ్యభూమి మన ఆంధ్ర భూమి ……

అదే ఈ పుణ్యభూమి మన తెలుగు భూమి….