రైతు – కవిత

పగలనక రేయనక

శ్రమజల్లులు కురిపించి

కరముల కండలు కరిగించి

బతుకు పంటను పండిస్తే..!!

వారి ఆశలను నీర్జివం చేసి

కరువు రక్కసి కాటేస్తుంటే

హృదయలోకం చిద్రమైనది

ప్రాణం శూన్యాన్ని కౌగిలించుకున్నది..!!

దేశ ప్రజల ఆకలి కేకలను తీర్చి

ఆ రైతన్న ఆకాశంలోకి ఆవిరైపోతున్నా

ఆ కష్టజీవి గుండెపోటుకు కారణం

ఈ దగకోరుల వెన్నుపోటే కదా..!!