సాంకేతిక పరిజ్ఞానం – కవిత

కాలం మారిందండి

కేవలం కాలి నడక సాధ్యం కాదండి

ఇక్కడ పరిగెత్తేది సాంకేతిక పరిజ్ఞానమండి

రోజు రోజుకి కొత్త ప్రదర్శనలండి

పూర్వం రోజులు మరిపోయాయండి

ఆటస్థలాలలో పిల్లలు లేరండి

స్మార్టుఫోన్లే మనల్ని ఆడిస్తున్నాయండి

కొత్త ఫీచర్లకి ఎల్లప్పుడు స్వాగతమేనండి

గ్రంథాలయాల్లో పని లేదండి

అన్నీ ఇందులోనే సాధ్యమండి

ప్రతీ ఒక్కరి ఓటూ దీనికేనండి

కంటికి రక్షణ లేదండి

మెదడు మొత్తం కాలుష్యమేనండి

చెమట చిందించడం ఎక్కడండి

ఈ సులువు దారి సురక్షితంకాదండి

స్మార్టుఫోన్లకి బానిస కావద్దండి!